హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో టీజీ ఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలక్రిష్ణ రెడ్డి విడుదల చేశారు. ఈసెట్ ఫలితాల్లో 93.87 శాతం ఉత్తీర్ణత సాధించారు. మెటలార్జికల్ ఇంజినీరింగ్, బీఎస్సీ మ్యాథ్స్, ఫార్మసీలో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ కుమార్, ఆచార్య చంద్రశేఖర్ పాల్గొన్నారు.
తెలంగాణ ఈ సెట్ అధికారిక వెబ్ సైట్
https://ecet.tgche.ac.in/TGECET/TGECET_RankCard_2025_GET.aspx
లో చూసుకొవచ్చని అధికారులు తెలిపారు
ఫస్ట్ ర్యాంక్స్ సాధించిన విద్యార్థులు వీరే
బీఎస్సీ మ్యాథ్స్‌లో సంతోష్ కుమార్, కెమికల్ ఇంజినీరింగ్‌లో లెంక తేజ సాయి, సివిల్ ఇంజినీరింగ్‌లో గోల్కొండ నిఖిల్ కౌశిక్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో శ్రీకాంత్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ కట్లే రేవతి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో కాసుల శ్రావణి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్సుట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో రాపర్తి చందన, మెకానికల్ ఇంజినీరింగ్‌లో పోతుగంటి కార్తిక్, మెటలర్జికల్ ఇంజినీరింగ్‌లో తోట సుబ్రహ్మణ్యం, మైనింగ్ ఇంజినీరింగ్‌లో కుర్మా అక్షయ, ఫార్మసీలో ఐలి చందన మొదటి ర్యాంకు సాధించారు