ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకోలేరు..

ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకోలేరు..

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : విద్యార్థుల ఫీజు బకాయిల విడుదల కోసం అసెంబ్లీ ముట్టడికి సిద్ధమవుతున్న జహీరాబాద్ బీఆర్ఎస్వీ సీనియర్ నాయకులు ఓంకార్, ఫయాజ్‌లను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. అనంతరం వారిని జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్రమ అరెస్టుల ద్వారా ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత నుండి తప్పించుకోలేదని విమర్శించారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా అరెస్టులకు పాల్పడటం తగదని పేర్కొన్నారు. విద్యార్థి విభాగం తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఇలాంటి చర్యలతో ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం నడపలేరని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అలాగే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

Leave a Reply