కొత్తగూడెం చెరువును ద్వంసం చేస్తున్నారు..

కొత్తగూడెం చెరువును ద్వంసం చేస్తున్నారు..

సంస్థన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : సంస్థన్ నారాయణపురం మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని చెరువును ధ్వంసం చేస్తున్నారని సిపిఎం మండల కమిటీ సభ్యులు రాచకొండ కృష్ణ ప్రకటనలో తెలిపారు. దాదాపు 27 ఎకరాల చెరువు అనేక సంవత్సరాలు కాలంగా ఈ చెరువు నిండితే వ్యవసాయ రైతు కూలీలు ఈ చెరువుని నమ్ముకుని బ్రతుకుతున్నారు.ఇదే సందర్భంలో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇటుక బట్టీల వ్యాపారులు ఈ మట్టిపై కన్నేసి ఆ చెరువును పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు.

జాతీయ ఉపాధి హామీ పథకంలో లక్షల రూపాయలు వెచ్చించి జాతీయ ఉపాధి కూలీలచే కట్టలు వేయించిన మట్టి అక్రమార్కులు ధ్వంసం చేస్తున్నారన్నారు. చెరువును తవ్వకాలు జరపడంతో నీరు వచ్చిన నిల్వ ఉంటలేదని వాపోయారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a Reply