బాధిత కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సహాయం ,
బాధిత కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సహాయం ,
చిట్యాల, మే 3 (ఆంధ్రప్రభ) : మండలంలోని కైలాపూర్ కి చెందిన సుంచు మల్లమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం గ్రామ సర్పంచి కొడారి ఓదెలు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కన్నవేణి రాజయ్య, రాయకోమురు, మేకల భూమయ్య, యూత్ నాయకులు సంద మహేందర్, జంబుల రాజు, వేముల హరీష్, ఉద్ధమారి కుమార్ పాల్గొన్నారు.
