RCB vs KKR | డిఫెండింగ్ ఛాంపియన్ కు షాకిచ్చిన వరుణుడు !

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్ వారం పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే దాదాపు 9 రోజుల తర్వాత ఈరోజు ఐపీఎల్ తిరిగి ప్రారంభమైంది. ఈరోజు బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ మ్యాచ్ జరుగుతుందని భావించ‌గా వరుణుడు షాక్ ఇచ్చాడు.

చిన్నస్వామి స్టేడియం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా టాస్ కూడా ప‌డ‌కుండానే ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ రద్దు అయ్యింది. రెండు జట్లకు చెరో పాయింట్ ఇచ్చిన తర్వాత అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. మరోవైపు, బెంగళూరు 17 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *