ఢిల్లీలో తొలిసారి ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. కుటుంబ సమేతంగా ప్రధానితో డిన్నర్ చేశారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై ప్రధానికి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పగల నాయకుడు ప్రధాని మోదీ అంటూ అమరావతి సభలో లోకేష్ పొగడ్తలు కురిపించారు.
ఈ భేటీ సందర్భంగా ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, కూటమి ప్రభుత్వం నేతృత్వంలో కొనసాగుతున్న అభివృద్ది కార్యక్రమాల గురించి కూడా ప్రధాని మోదీకి లోకేష్ వివరించినట్టుగా తెలుస్తోంది. మహానాడు వేదికగా తెలుగు దేశం పార్టీలో లోకేష్‌కు మరింత ముఖ్యమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. ప్రధాని మోదీని కలవడంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరిన ట్లుగా మారుతోంది. ప్రధానితో కూడా లోకేష్ ఏపీలోని రాజకీయ అంశాలు, టీడీపీ పార్టీ, సమావేశాలు కూడా చర్చించినట్లుగా విశ్వసనీయ సమాచారం.
బ్రాహ్మణి, దేవాన్ష్‌తో ముచ్చట్లు
ప్రధాని మోదీ మంత్రి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ తో సరదాగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే దేవాన్ష్ తో సరదగా కొద్ది సేపు మాట్లాడారు. బ్రాహ్మణితో కూడా కుటుంబం, రాజకీయ అంశాలపై ప్రధాని మాట్లాడినట్లుగా సమాచారం.