RCB Celebrations | హైదరాబాద్‌లో ఆర్‌సీబీ అభిమానుల అత్యుత్సాహం

RCB Celebrations | హైదరాబాద్‌లో ఆర్‌సీబీ అభిమానుల అత్యుత్సాహం

ట్రాఫిక్‌కు అంతరాయం.. పోలీసుల లాఠీఛార్జ్

RCB Celebrations | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ ఫైనల్లో గుజ‌రాత్‌పై ఆర్‌సీబీ విజయం సాధించడంతో హైదరాబాద్‌లో అభిమానులు భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. వందలాది మంది ట్యాంక్‌బండ్, సచివాలయం పరిసర ప్రాంతాలకు చేరుకుని హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అయితే, కొందరు అభిమానులు అత్యుత్సాహంతో కార్లపైకి ఎక్కి నినాదాలు చేస్తూ హంగామా చేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి గుంపులను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేసినట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే ఆర్‌సీబీ హోంగ్రౌండ్ బెంగళూరు నగరం టపాసుల మోతతో దద్దరిల్లింది. అటు విశాఖపట్నంలోని బీచ్ రోడ్డుకు ఫ్యాన్స్ భారీగా పోటెత్తి, కారు ఎక్కి మరీ రచ్చ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు.

CLICK HERE TO WATCH VIDEO