Nepali Gang | రిటైర్డ్ ఐపీఎస్ భార్య దారుణ హత్య

Nepali Gang | రిటైర్డ్ ఐపీఎస్ భార్య దారుణ హత్య

Nepali Gang | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే నివాసంలో ఆయన భార్య హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హత్యకు ఇంట్లో పనిచేసే పనిమనిషే కారణమని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం, ఇవాళ ఉదయం ఇంట్లో ఆమె విగతజీవిగా పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటన వెనుక నేపాలీ గ్యాంగ్ హస్తం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న పనిమనిషి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పనిమనిషి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నాయి. ఘటనాస్థలాన్ని సీపీ సజ్జనార్, ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిశీలించారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.