kamareddy | ఏం కష్టమొచ్చిందో.. తల్లితో పాటు ముగ్గురు అదృశ్యం
kamareddy | ఏం కష్టమొచ్చిందో.. తల్లితో పాటు ముగ్గురు అదృశ్యం
kamareddy |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. తల్లి లయ (31)తో పాటు ఆమె ముగ్గురు పిల్లలు శివ (13), బిందు (16), దివిజ (8) కనిపించకుండా పోయారు.

ఈ ఘటనపై కుటుంబ సభ్యులు కామారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాల నేపథ్యంలో లయ పిల్లలను వెంట తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

అదృశ్యమైన నలుగురి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వారి జాడకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు సమీప పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు.

