గచ్చిబౌలిలో అగ్ని ప్రమాదం..

గచ్చిబౌలిలో అగ్ని ప్రమాదం..

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని టీఎన్జీవో కాలనీలో ఓ అపార్ట్ మెంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. దట్టమైన పొగ అలుముకోవడంతో ఊపిరాడక అక్కడ జనాలు ఇబ్బంది పడ్డారు. అయితే.. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పై అంతస్థులో చిక్కుకున్న వారిని కాపాడారు. వీరిలో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హాస్పటల్ కి తరలించారు. షార్ట్ సర్క్యూట్ వలనే అగ్ని ప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో 15 ద్విచక్ర వాహనాలు దగ్ధం అయ్యాయి.

Leave a Reply