రాప్తాడులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

రాప్తాడులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
రాప్తాడు, ఆంధ్రప్రభ : రాప్తాడు నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే పరిటాల సునీత సోమవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
టిడిపి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆత్మకూరు, అనంతపురం రూరల్, రాప్తాడు మండలాలకు చెందిన 22 మంది లబ్ధిదారులకు రూ.26 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. ఇందులో ఒక ఎల్.ఓ.సి మంజూరు పత్రం కూడా ఉంది.
ఈ కార్యక్రమానికి నియోజకవర్గ అబ్జర్వర్ పద్మలతా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 23 నెలల్లో 1,290 మందికి రూ.9.82 కోట్ల సాయం అందించినట్లు తెలిపారు. అవసరమైన సందర్భాల్లో ఎల్.ఓ.సి ద్వారా తక్షణ సాయం కూడా అందించామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ నాయుడు, మండల కన్వీనర్ పంపు కొండప్ప, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
