Rajinikanth Clarification | స్టాలిన్ ను అందుకే కలిసాను – రజినీకాంత్

Rajinikanth Clarification | స్టాలిన్ ను అందుకే కలిసాను – రజినీకాంత్

Rajinikanth Clarification | కమల్ హాసన్ సీఎం అయితే అసూయపడతా
రాజకీయాలతో నాకు సంబంధం లేదు
స్టాలిన్‌ను కలవడంలో దురుద్దేశం లేదు
వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చిన రజినీకాంత్

Rajinikanth Clarification | చెన్నై : తమిళ సూపర్ స్టార్ Rajinikanth మరోసారి తన రాజకీయ వైఖరిపై స్పష్టత ఇచ్చారు. తాను ఎప్పుడూ నీచ రాజకీయాలు చేయనని, వ్యక్తిగత సంబంధాలను రాజకీయాలతో ముడిపెట్టడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి M. K. Stalinను కలిసిన నేపథ్యంలో వస్తున్న రాజకీయ ప్రచారంపై స్పందించిన ఆయన, ఆ భేటీలో ఎలాంటి దురుద్దేశం లేదని తెలిపారు.

అలాగే నటుడు, రాజకీయ నాయకుడు Kamal Haasan ముఖ్యమంత్రి అయితే తనకు అసూయ కలుగుతుందని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే అది వ్యక్తిగతంగా స్నేహపూర్వక వ్యాఖ్య మాత్రమేనని, రాజకీయ అర్థాలు వెతకవద్దని చెప్పారు. తనకు ప్రస్తుతం రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని రజినీకాంత్ స్పష్టం చేశారు. ప్రజాసేవ చేయడానికి రాజకీయాలే ఒక్క మార్గం కాదని, తనకు సాధ్యమైన విధంగా సమాజానికి సేవ చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు.

విజయ్ సీఎం కాకుండా అడ్డుకోవాలి అనుకో లేదు అన్నారు. పార్టీ పెడితే ఖచ్చితంగా గెలిచేవాడిని. విజయ్ నాకు సమవుజ్జీ అనుకోవడం లేదు అన్నారు రజినీకాంత్. ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఆయన రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే అంశంపై అభిమానులు, రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ ఆసక్తి కొనసాగుతోంది.

Leave a Reply