గుర్తుతెలియని మహిళ మృతదేహం గుర్తింపునకు ఆర్‌పీఎఫ్ విజ్ఞప్తి

కేదారరాజేశ్వర పేట, ఆంధ్రప్రభ : ఈ నెల 7వతేదీన తెల్లవారుజామున ఫ్లాట్ ఫారం నెం. 1, ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు రైల్వే పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. మృతురాలి వయస్సు సుమారు 35 సంవత్సరాలు, ఎత్తు సుమారు 5 అడుగులు, ఛామనచాయ రంగుతో ఉన్నట్లు పేర్కొన్నారు.

ఆమె బ్రౌన్ రంగు నైటీ, లోపల ఎరుపు రంగు లంగా ధరించి ఉంది. జుట్టుకు లేయర్ కటింగ్ ఉంది. మెడలో పసుపు తాడు, నల్లపూసల సూత్రం, చేతులకు రోల్డ్ గోల్డ్ గాజులు, మట్టి గాజు, కాళ్లకు వెండి మెట్టెలు ధరించి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మహిళ వివరాలు ఎవరికైనా తెలిసి ఉంటే వెంటనే రైల్వే పోలీస్ స్టేషన్, విజయవాడను సంప్రదించాలని అధికారులు కోరారు. 0866-2768630 9110364666 ఫోన్లను సంప్రదించాలని కోరారు.