మంచిర్యాల నూతన డీఎఫ్ఓగా రాహుల్ కిషన్ జాదవ్

మంచిర్యాల నూతన డీఎఫ్ఓగా రాహుల్ కిషన్ జాదవ్

మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా అటవీ శాఖ నూతన డీఎఫ్ఓగా రాహుల్ కిషన్ జాదవ్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు పని చేసిన శివ్ ఆశిష్ సింగ్ మహబూబ్ నగర్ డీఎఫ్ఓగా బదిలీ అయ్యారు. మంచిర్యాల జిల్లా డీఎఫ్ఓగా నియమితులైన రాహుల్ కిషన్ జాదవ్ ములుగు జిల్లా నుంచి బదిలీ పై ఇక్కడికి రానున్నారు. వీరిద్దరూ 2018 ఐఎఫ్ఎస్ బ్యాచ్ కు చెందిన యువకులు కావడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో డీఎఫ్ఓలుగా 3 సంవత్సరాల పై బడి పని చేస్తున్న ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

మంచిర్యాల జిల్లాలో డీఎఫ్ఓగా ఇంత కాలం పని చేసిన శివ్ ఆశిష్ సింగ్ జిల్లాలో అడవులు, వన్య ప్రాణుల రక్షణలో కీలక పాత్ర వహించి సిబ్బందికి మెరుగైన సూచనలు ఇస్తూ సౌమ్యులుగా పేరు తెచ్చుకున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. కాగా నూతన డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ గతంలో ఉట్నూర్ ఐడీడీఏ పీవోగా పని చేసిన అనుభవం ఉంది. కొత్త డీఎఫ్ఓ శుక్రవారం లేదంటే.. శనివారం మంచిర్యాలలో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

Leave a Reply