కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలి..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ ఆరె మల్లేష్ గౌడ్ సందర్శించిన అనంతరం మంగళవారం మాట్లాడారు . గత మూడు రోజులుగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని తీసుకు వెళ్లడానికి లారీల సౌకర్యం లేకుండా పోయిందని ఆయన చెప్పారు. అధికారులు వెంటనే స్పందించి రవాణా నిమిత్తం లారీలను పంపించాలని సూచించారు. వార్డు సభ్యులు బొంకూరు మల్లయ్య, చీరాల బాలశంకర్, బీఆర్ఎస్ నాయకులు ఎండి జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
