టీజేఎంయూ సంగారెడ్డి డిపో గౌరవ అధ్యక్షుడిగా తోపాజి అనంత కిషన్

సంగారెడ్డి, ఆంధ్రప్రభ: తెలంగాణ జాతీయ మాజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) సంగారెడ్డి డిపో గౌరవ అధ్యక్షుడిగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్‌ను నియమించినట్లు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. యూనియన్ కార్యకలాపాలు, ఎన్నికలు, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన అన్ని అంశాల్లో తోపాజి అనంత కిషన్‌తో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆయన యూనియన్ నాయకులకు సూచించారు.

యూనియన్ బలోపేతంతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని జగ్గారెడ్డి పేర్కొన్నారు. యూనియన్ నాయకుల విజ్ఞప్తి మేరకే ఈ నియామకం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీజేఎంయూ రాష్ట్ర కార్యదర్శి పల్లె కృష్ణమూర్తి, డివిజన్ కార్యదర్శి అంజాగౌడ్, డిపో అధ్యక్షుడు మహేందర్, కార్యదర్శి విక్రమ్, జాయింట్ సెక్రటరీ ఎం. రవి, సురేష్, హిమగిరి, వెంకటేశం, రవి, వహీద్, మల్లికార్జున, మధుకర్, విజయ, సక్కుబాయ్ తదితరులు పాల్గొన్నారు.