అరవింద్ యాదవ్ మృతి పట్ల ఎమ్మెల్యే సంతాపం

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమకారుడు బీరయ్య యాదవ్ పెద్ద కుమారుడు అరవింద్ యాదవ్ మృతి చెందడం పట్ల సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విషాద వార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్యే ప్రభాకర్ బొబ్బిలిగామా గ్రామానికి చేరుకుని బీరయ్య యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అరవింద్ యాదవ్ అకాల మరణం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
