గాంధీనగర్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ
కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిప్పులు
ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది
గడిచిన రెండేళ్లలో విజయవాడ నగర అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు
కూటమి రెండేళ్ల పరిపాలనపై చర్చకు మేం సిద్ధం
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ,ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా, ప్రజలకు చేసిన మేలేమీ లేదనీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. వెన్నుపోటుకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ కుర్మయ్య విగ్రహం సంబమూర్తి రోడ్డు విజయ టాకీస్ వంతెన నుండి గాంధీనగర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. మాటలకి, చేతలకి పొంతన లేదనీ, ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకి… ప్రస్తుత వారి పరిపాలనకి ఏమాత్రం పొంతన లేదన్నారు. ప్రజల శ్రేయస్సు కోరి పని చేస్తున్న దాఖలాలు కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదనీ విమర్శించారు.

కుటమి వంచన పాలన
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం ప్రజలను రకరకాలుగా వంచిస్తూ, మోసం చేస్తోందని, వైసిపిపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్నారు. నగర ప్రజలు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా తెలుగుదేశం కూటమి అభ్యర్థులనే గెలిపించినా.. విజయవాడకు దక్కిన ప్రయోజనం శూన్యం అన్నారు. గత రెండేళ్లలో నగర అభివృద్ధికి ఒక్క రూపాయి నిధులు కూడా మంజూరు చేయలేదన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకి… ప్రస్తుత వారి పరిపాలనకి ఏమాత్రం పొంతన లేదనీ, ప్రజల శ్రేయస్సు కోరి పని చేస్తున్న దాఖలాలు కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదన్నారు.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం ప్రజలను రకరకాలుగా వంచిస్తూ, మోసం చేస్తోందనీ, వైసిపిపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. నగర ప్రజలు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా తెలుగుదేశం కూటమి అభ్యర్థులనే గెలిపించినా.. విజయవాడకు దక్కిన ప్రయోజనం గత రెండేళ్లలో నగర అభివృద్ధికి ఒక్క రూపాయి నిధులు కూడా మంజూరు చేయలేదన్నారు. గత వైసిపి హయాంలో విజయవాడ నగరంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామని మల్లాది విష్ణు గుర్తు చేశారు.
కానీ ప్రస్తుత కూటమి పాలనలో నగరం అధ్వాన్నంగా తయారైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో నగరంలో పారిశుధ్య లోపం, తాగునీటి సమస్యలు తీవ్రమయ్యాయని, వర్షాల కారణంగా నగరంలోని రోడ్లన్నీ గుంతలమయంగా మారినా పట్టించుకునే నాథుడే లేడన్నారు. అభివృద్ధి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని, గడిచిన రెండేళ్లలో ప్రజలకు తామేం చేశామో చెప్పుకోలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని చెప్పారు. క్యాబినెట్ మీటింగ్ పెట్టి తిరుపతి, అమరావతి, విశాఖల్లో సభలు నిర్వహించాలనడం చంద్రబాబు హాస్యాస్పద చర్య అన్నారు. మీ రెండేళ్ల పరిపాలనపై చర్చకు మేం సిద్ధం, మీరు సిద్ధమా?” అంటూ మల్లాది విష్ణు బహిరంగ సవాల్ విసిరారు. ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్పి, ఇప్పుడు ఏ ఒక్క పనిని కూడా పూర్తి చేయడం లేదంటూ కూటమి నేతలపై మల్లాది విష్ణు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కేబినెట్ పరిధిలోని అన్ని కీలక శాఖలు నిలిచిపోయాయని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వాల హయాంలో అద్భుతంగా పనిచేసిన వైద్య, విద్యా, దేవదాయ శాఖలు ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. ఈ వైఫల్యాలపై ముఖ్యమంత్రి కూడా క్యాబినెట్ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారంటూ, దీనిపై తక్షణమే సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆరోగ్యశ్రీ అస్తవ్యస్తం ఆసుపత్రుల్లో దుర్భర పరిస్థితులు
గతంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకు రూ.25 లక్షల వరకు మెరుగైన ఉచిత వైద్యం అందించేలా ప్రొసీజర్స్ తీసుకొచ్చారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని నేతలు ఆరోపించారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు వెళ్తే రోగులను పట్టించుకునే నాథుడే లేడు… గుండె ఆపరేషన్లు చేసే ఆసుపత్రులు కూడా కరువయ్యాయిన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ కోసం చేపట్టిన ‘నాడు-నేడు’ పనులను ఈ ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసిందని, ఆసుపత్రుల్లో మందులు, స్ట్రెచర్లు, డాక్టర్లు లేరు… అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడాల్సిన 108 అంబులెన్స్ సేవలు సైతం మూలనపడ్డాయనీ విమర్శించారు.
కరెంట్ కోతలతో మరణాలు
అనంతపురం, కాకినాడ ఆసుపత్రుల్లో ఆపరేషన్లు జరుగుతున్న సమయంలో కరెంట్ పోతోందని, విశాఖపట్నం కేజీహెచ్ లో విద్యుత్ నిలిచిపోవడంతో ఒకరు మరణించారని మల్లాది విష్ణు మండిపడ్డారు. విద్యా, దేవదాయ, శాంతిభద్రతల వైఫల్యం
కేవలం వైద్య రంగమే కాకుండా విద్య, దేవదాయ, నీటిపారుదల శాఖలు కూడా ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. డిఐసి నిర్వహణలో విద్యాశాఖ పూర్తిగా ఫెయిల్ అయిందని, ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు చేతులెత్తేసారని పేర్కొన్నారు. దీనిపై స్వయంగా ముఖ్యమంత్రే క్యాబినెట్ లో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం వారి తప్పును ఒప్పుకున్నట్లేనని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో దేవదాయ శాఖ వైఫల్యాలు, అవినీతిపై ప్రతిరోజూ పత్రికల్లో కథనాలు వస్తున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించాయని, మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై హైకోర్టు కూడా పలుమార్లు ప్రభుత్వానికి అక్షింతలు వేసిందని గుర్తు చేశారు.
అధికార దుర్వినియోగం విమర్శిస్తే కేసులు
ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు కేవలం ప్రతిపక్ష నాయకులను వేధించడానికి, వారి గొంతు నొక్కడానికే పరిమితమయ్యారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే, అక్రమాలను ప్రజల ముందు పెడితే.. ఏ రకంగా భయపెట్టాలి, ఎలా కేసులు నమోదు చేయాలి అనే కోణంలోనే ప్రభుత్వం ఆలోచిస్తోంది తప్ప వ్యవస్థలను సరిదిద్దడం లేదన్నారు. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని, ఏ పని కావాలన్నా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. చివరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతూ, ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ర్యాలీతో విజయవాడ రాజకీయం మరింత హీటెక్కింది. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
