Vivekananda | జీవితం యువతకు ఆదర్శం

Vivekananda | మక్తల్, ఆంధ్రప్రభ : స్వామి వివేకానంద జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని పలురురు పేర్కొన్నారు. స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలను నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని స్వామి వివేకానంద చౌరస్తా వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానందుడి చిత్రపటానికి ఏబీవీపీ ఆధ్వర్యంలో వివిధ ఉపాధ్యాయ, ధార్మిక సంఘాల నాయకులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… స్వామి వివేకానంద చూపిన బాటలో యువత నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్వామి వివేకానంద చికాగోలో జరిగిన ప్రపంచ సదస్సులో పాల్గొని భారతదేశ గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి అన్నారు.
ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర అధ్యక్షులు అంజిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వినయ్ కుమార్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, హిందూ వాహిని, తపస్ నాయకులు వి.భీమ్ రెడ్డి, మల్లికార్జున్, నర్సింహా, బి.రవీందర్, కొడంగల రఘు ప్రసన్న భట్, తదితరులు పాల్గొన్నారు.
