ఈనెల 10 వ తేదీన తెలంగాణకు ప్రధాని మోదీ..

ఈనెల 10 వ తేదీన తెలంగాణకు ప్రధాని మోదీ..
- ఎంపీ ఈటల రాజేందర్..
మేడ్చల్, ఆంధ్రప్రభ : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 10వ తేదీన తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రానున్నారని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ వెల్లడించారు. ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తెలంగాణకు రావడం ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం గుండ్లపోచంపల్లిలో డివిజన్ అధ్యక్షులు కావేరీ శ్రీధర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యటన వివరాలను వెల్లడించారు..
ప్రధాని పర్యటనలో భాగంగా రాష్ట్రంలో సుమారు 7,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు ఈటల రాజేందర్ తెలిపారు. ఇందులో భాగంగా మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు, సభకు ‘జన ఆగ్రహ సభ’గా నామకరణం,రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఈటల రాజేందర్ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ప్రధాని పాల్గొనే బహిరంగ సభను జన ఆగ్రహ సభగా నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ సభకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు విక్రమ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, సభ ఇంచార్జి అంజన్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి, జిల్లా నాయకులు కృష్ణ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిలర్లు దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్, సముద్రాల హంసారాణి, డివిజన్ ఇంచార్జీ జగన్ గౌడ్, మాజీ ఎంపీటీసీలు ఉషిగారి శ్రీనివాస్ ముదిరాజ్, గడీల విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
