IND vs PAK | కోహ్లీ న‌యా ఫీట్.. సచిన్ రికార్డు బద్దలు!

టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈరోజు (ఆదివారం) పాకిస్థాన్‌తో జరుగుతున్న‌ మ్యాచ్‌లో… దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 14,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

విరాట్ కోహ్లీ నేటి మ్యాచ్ తో క‌లిపి 299 వ‌న్డేలు ఆడాడు. 287 ఇన్నింగ్స్‌ల్లో 57.8 స‌గ‌టుతో 14008 ప‌రుగులు చేశాడు. ఇందులో 50 సెంచ‌రీలు, 73 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అయితే స‌చిన్ 14వేల పరుగుల మైలురాయిని 350 వ‌న్డే ఇన్నింగ్స్‌ల్లో చేరుకున్నాడు.

ఇక వ‌న్డేల్లో ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే 14 వేలకు పైగా పరుగులు సాధించారు. సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర 14,234 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ జాబితాలో కోహ్లీ మూడో ప్లేయర్‌గా నిలిచాడు.

వ‌న్డేల్లో 14000+ర‌న్స్‌ చేసిన ఆట‌గాళ్లు వీరే..

స‌చిన్ టెండూల్క‌ర్ (భార‌త్‌) – 18,426 ప‌రుగులు
కుమార సంగ‌క్క‌ర (శ్రీలంక‌) – 14, 234 ప‌రుగులు.
విరాట్ కోహ్లీ (భార‌త్) – 14, 008 ప‌రుగులు*

Leave a Reply