21న రాష్ట్రపతి రాక

  • ఏర్పాట్లల్లో తిరుమల అధికారులు సన్నద్ధం

తిరుమల, ఆంధ్రప్రభ ప్రతినిధి : భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నవంబరు 21న తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు.రెండు రోజుల పర్యటనలో రాష్ట్రపతి ముందుగా నవంబరు 20న తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకుని అనంతరం తిరుమలకు చేరుకుంటారు.

ఆలయ సంప్రదాయం ప్రకారం నవంబరు 21న రాష్ట్రపతి ముందుగా వరాహస్వామి ఆలయాన్ని, తరువాత శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన నిమిత్తం కావాల్సిన అన్ని ఏర్పాట్లపై గురువారం తిరుమలలోని పద్మావతి విశ్రాంతి భవనం సమావేశ మందిరంలో టిటిడి అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఆయనతో పాటు సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు. రాష్ట్రపతి రెండు రోజుల పర్యటనను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి లోపం లేకుండా, పూర్తిస్థాయిలో, సమగ్ర ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు అదనపు ఈవో సూచించారు. ఈ సమావేశంలో ఎస్వీబీసీ సీఈఓ ఫణికుమార్ నాయుడు, సిఈ సత్యనారాయణ, అదనపు ఎస్పీ రామకృష్ణ, తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply