చెన్నూర్ మాజీ సర్పంచ్ మధుసూదన్ మృతి

చెన్నూర్ మాజీ సర్పంచ్ మధుసూదన్ మృతి

చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మాజీ సర్పంచ్ రేగళ్ల‌ మధుసూదన్(కాక‌) (Regalla Madhusudhan) మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొద్దుతూ బుధ‌వారం వేకువజమున మృతిచెందారు. కోటపెల్లి మండల కేంద్రానికి చెందిన మొదటి సారి మాజీ ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు తెలుగుదేశం పార్టీ ఆరంభంలో టీడీపీ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేశారు.

మొదటిసారి ఎన్‌టీఆర్‌ తీసుకు వచ్చిన మండల వ్యవస్థలో కోటపెల్లి మండల అధ్యక్షుడిగా ఎన్నికై రాజకీయకంగా అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) స్థాయిలో పేరు పొందారు. కాలక్రమమే చెన్నూర్ కేంద్రానికి మకాం మార్చిన మధుసూదన్ స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం చెన్నూర్ సర్పంచ్‌గా పోటీ చేసి విజయం సాధించారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో ఒక్కడై మధుసూదన్ కాకగా పిలుపించుకున్నారు.

Leave a Reply