ప్రీ-ప్రైమరీ తరగతి గదిని ప్రారంభించిన సర్పంచి
జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కామనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చిన్నారుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీ-ప్రైమరీ తరగతిగదిని గ్రామ సర్పంచి పేరం శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఆధునిక సౌకర్యాలతో ప్రభుత్వ విద్యను మెరుగుపరచడం సంతోషకరమన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం,చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రీ-ప్రైమరీ తరగతులను అందుబాటులోకి తీసుకొచ్చారని ఆయన తెలిపారు.
అంగన్‌వాడీలకు దీటుగా, ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యాధునిక వసతులతో విద్యను అందించడం వల్ల పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్.ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు షఫీక్, గోవింద్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
