TMKMKS | మహాసభలను విజయవంతం చేయాలి

TMKMKS | మహాసభలను విజయవంతం చేయాలి
వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మత్స్య కార్మిక సంఘం నాయకులు
TMKMKS | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : కరీంనగర్ పట్టణం (Karimnagar town) లో ఈనెల 25, 26 తేదీల్లో జరగనున్న తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం (TMKMKS) రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలో గురువారం వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో TMKMKS మండల అధ్యక్షులు గొనెల వెంకన్న, మండల ప్రధాన కార్యదర్శి లింగనబోయిన రాజు, మహిళా మండల బాధ్యులు పిట్టల స్వరూప తదితరులు పాల్గొన్నారు.
మండల నాయకులు పి. శంకర్, గొనెల రాజయ్య, మెడబోయిన అరుణ, పిట్టల విజయ్, బాలబాయిన శిరీష, పిట్టల భద్రమ్మ కార్యక్రమాన్ని చేపట్టి, రాష్ట్ర మహాసభలు ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల విస్త రణ కోసం జరగనున్న ఈ మహాసభలు చారిత్రాత్మకంగా నిలుస్తాయని నాయకులు పేర్కొన్నారు.
