polling |నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు

polling |నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు

  • సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన :కోస్గి సీఐ సైదులు

polling | మద్దూర్, ఆంధ్రప్రభ : మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ దృష్టిలో ఉంచుకుని ఈ రోజు ఎస్పీ డాక్టర్ వినీత్(SP Dr. Vineeth) ఆదేశాల మేరకు సీఐ సైదులు, ఎస్ ఐ విజయ్ కుమార్ మద్దూర్ మండలంలోని దోరేపల్లి, పల్లెగడ్డ తండా, నిడ్జింత, కొత్తపల్లి మండల నామినేషన్ కేంద్రాలను సందర్శించారు. అనంతరం మండల పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల(polling stations)ను పరిశీలించి.

పోలింగ్ రోజు ఎటువంటి అంతరాయాలు లేకుండా, శాంతి భద్రతల మధ్య ఎన్నికలు జరిగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా సీఐ సైదులు మాట్లాడుతూ.. సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు బందోబస్తు, ప్రాథమిక సౌకర్యాలు అయిన త్రాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు మొత్తంగా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుతంగా సాగేందుకు పోలీసులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ఎస్సై విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. నామినేషన్ కేంద్రాల వద్ద హెడ్ కానిస్టేబుల్స్(head constables), కానిస్టేబుళ్లకు క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి, ఎలాంటి అనవసర గుంపులు, ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పహారా బలోపేతం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ, పోలీసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply