వీజీబీ రామ్జీ బిల్లును రద్దు చేయాలని నిరసన
మోత్కూర్, ఆంధ్రప్రభ: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వీజీబీ రామ్జీ బిల్లును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామీణ పేదల జీవనోపాధికి భరోసాగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఎన్పీఆర్డీ భువనగిరి డివిజన్ ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి, మండల మహిళా అధ్యక్షురాలు వస్తుపుల మంజుల, లక్ష్మి, రాములు తదితరులు పాల్గొన్నారు.
