నర్సరీలో మొక్కలను సంరక్షించాలి ; ఎంపీడీవో

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : నర్సరీలో మొక్కలను సంరక్షించాలనీ కమ్మర్ పల్లి మండల అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం కమ్మర్ పల్లి మండలం అమీర్ నగర్ గ్రామంలోని నర్సరీలో పెరుగుతున్న మొక్కలను సందర్శించి పరిశీలించారు. వాతావరణ సమతుల్యతకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని అన్నారు. నర్సరీలో మొక్కలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మొక్కలు ఎదిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్ కు సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీలత,ఈజిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply