Pilot Harassment Case | జిమ్ మేనేజర్‌పై కేసు
Pilot Harassment Case | జిమ్ మేనేజర్‌పై కేసు
Pilot Harassment Case | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఓ మహిళా పైలట్‌కు వేధింపుల ఘటన కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కల్ట్ జిమ్ ఫిట్‌నెస్ మేనేజర్ సంతోష్‌గౌడ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జిమ్ ట్రైనింగ్ పేరుతో తనను లోబర్చుకునేందుకు సంతోష్‌గౌడ్ ప్రయత్నించాడని బాధితురాలు ఆరోపించింది. తన ప్రతిపాదనలను తిరస్కరించడంతో సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర సందేశాలు పంపుతూ వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
ఈ వ్యవహారంలో సంతోష్‌గౌడ్‌కు అతని స్నేహితురాలు రజనీ సహకరించినట్లు కూడా బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. వేధింపులకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
