July-2026-Ap-Reservoir : ఎల్ నినో పటపట Andhra Prabha Spl Story
July-2026-Ap-Reservoir : ఎల్ నినో పటపట Andhra Prabha Spl Story
- ఏపీ కటకట
- కరవు సైరన్ మోత
- అడుగంటిన జలాశయాలు
- ఆకాశం వైపు.. రైతన్న చూపు
- .శ్రీశైలం మినహా ,, ప్రాజెక్టులన్నీ డెడ్ స్టోరేజీకి చేరిక .
- తాజా పరిస్థితి ఆందోళనకరం
( కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ )

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయికి చేరుకోలేదు. నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో చురుగ్గా లేకపోవడంతో ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహాలు లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం మినహా మిగిలిన ప్రధాన రిజర్వాయర్లు కనిష్ఠ నిల్వలతోనే కొనసాగుతున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రాజెక్టుల్లోకి కొంత మేర ప్రవాహాలు నమోదవగా, ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించకపోవడం రైతాంగంలో ఆందోళన కలిగిస్తోంది.
నీటిపారుదల శాఖ గురువారం విడుదల చేసిన జలాశయాల నివేదిక ప్రకారం శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 42.15 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 821.80 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఎగువ నుంచి గణనీయమైన వరద ప్రవాహం లేకపోవడంతో నిల్వలు నెమ్మదిగా మాత్రమే పెరుగుతున్నాయి.
ఒకప్పుడు రాయలసీమ రైతాంగానికి ప్రధాన ఆధారంగా
నిలిచిన తుంగభద్ర జలాశయం పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 9.313 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. జలాశయానికి ఎలాంటి ఇన్ఫ్లో లేకపోగా, దిగువకు కేవలం 176 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారు. దీంతో ఖరీఫ్ సాగుకు నీటి లభ్యతపై అనిశ్చితి నెలకొంది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఇదే తరహాలో ఉంది. గాజులదిన్నె ప్రాజెక్టులో 4.50 టీఎంసీల సామర్థ్యానికి గాను 2.70 టీఎంసీలు, సుంకేసుల బ్యారేజీలో 1.235 టీఎంసీల సామర్థ్యానికి 0.99 టీఎంసీలు, వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 16.95 టీఎంసీల సామర్థ్యానికి 1.927 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి.

అలాగే గోరకల్లు రిజర్వాయర్లో 2.62 టీఎంసీలు, ఓవ్క్ రిజర్వాయర్లో 0.788 టీఎంసీలు, పత్తికొండ పరిధిలోని పందికోన రిజర్వాయర్లో 0.675 టీఎంసీలు, పులికనుమ రిజర్వాయర్లో 0.165 టీఎంసీలు, కృష్ణగిరి రిజర్వాయర్లో కేవలం 0.013 టీఎంసీలు, జుర్రేరు ప్రాజెక్టులో 0.11 టీఎంసీలు, వరదరాజస్వామి గుడి ప్రాజెక్టులో 0.027 టీఎంసీలు మాత్రమే నీరు నిల్వ ఉంది. అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తిగా ఖాళీగా ఉంది.
గ July-2026-Ap-Reservoir : త ఏడాదితో పోలిస్తే…
గత ఏడాది ఇదే సమయానికి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో తుంగభద్ర, శ్రీశైలం, వెలుగోడు వంటి ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపించింది. ఈ ఏడాది మాత్రం వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహాలు లేక నిల్వలు ఆశించిన స్థాయికి చేరలేదు. ముఖ్యంగా తుంగభద్ర జలాశయంలో నిల్వలు తక్కువగా ఉండటం రాయలసీమ సాగునీటి ప్రణాళికలపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
July-2026-Ap-Reservoir : రైతుల చూపు .. ఆకాశం వైపు

ఖరీఫ్ సాగు ప్రారంభ దశలో ఉండటంతో రైతుల ఆశలన్నీ నైరుతి రుతుపవనాలపైనే ఉన్నాయి. జూలై మొదటి, రెండో వారాల్లో ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిస్తేనే తుంగభద్ర, శ్రీశైలం జలాశయాల్లోకి వరద ప్రవాహాలు పెరిగి దిగువ ప్రాజెక్టులు కూడా జలకళ సంతరించుకునే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నిల్వలు తాగునీటి అవసరాలకు సరిపోతున్నప్పటికీ, సాగునీటి అవసరాల దృష్ట్యా మరింత వర్షపాతం అత్యవసరమని అధికారులు పేర్కొంటున్నారు.
