People’s | బొమ్మూరు పీఎస్ లో ఫిర్యాదు

People’s | బొమ్మూరు పీఎస్ లో ఫిర్యాదు
People’s | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వైసీపీ నేతలు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా వైసీపీ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. మీడియాను అడ్డుపెట్టుకుని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. రాజకీయాల పేరుతో శాంతిభద్రతలను భంగం కలిగించే చర్యలను సహించబోమని హెచ్చరించారు.
