Pension | మాజీ న్యాయమూర్తులందరికీ సమాన పెన్షన్ – సుప్రీంకోర్టు ఆదేశం

న్యూ ఢిల్లీ – కొంతమంది హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులకు తక్కువ పెన్షన్ ఇస్తుండడంపై తాజాగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇందులోభాగంగా.. హైకోర్టు మాజీ న్యాయమూర్తులందరికీ పూర్తిస్థాయిలో సమాన పెన్షన్ అందజేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగంలో చేరిన తేదీ, ఇతర విషయాలతో సంబంధం లేకుండా మాజీ న్యాయమూర్తులకు పెన్షన్ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ న్యాయమూర్తులకు, అన్ని జిల్లాల న్యాయమూర్తులకు పదవీ విరమణ తర్వాత ప్రయోజనాలు సమానంగా ఉండాలని స్పష్టం చేసింది. పదవీవిరమణ తర్వాత న్యాయమూర్తుల మధ్య ఎటువంటి వివక్ష చూపినా అది ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్లు అవుతుందని సీజేఐ పేర్కొన్నారు.


హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులకు సంవత్సరానికి రూ.15 లక్షల పెన్షన్.. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులకు రూ.13.5 లక్షల పూర్తి పెన్షన్ చెల్లించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Leave a Reply