Boat Capsize | ముగ్గురు జాలర్లు సురక్షితం, ఒకరి మృతదేహం లభ్యం
Boat Capsize | ముగ్గురు జాలర్లు సురక్షితం, ఒకరి మృతదేహం లభ్యం
సురక్షితంగా బయట పడ్డ ముగ్గురు మత్యకారులు
గల్లంతైన మత్యాకారుడు మృతి
బంగారమ్మపాలెం ఏటి మొగ వద్ద మృతదేహం లభ్యం
పోస్ట్ మార్టం నిమిత్తం నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
Boat Capsize | ఎస్.రాయవరం , ఆంద్ర ప్రభ : అనకాపల్లి జిల్లా ,ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం లో బోటు బోల్తా పడింది. సముద్ర తీర ప్రాంతం వద్ద అలల ఉదృతి ఎక్కువ కావడంతో బోటు బోల్తా పడింది.బోల్తా పడిన నలుగురు మత్యకారులు ఉన్నారు.బోటు బోల్తా పడిన వెంటనే తీరం లో ఈదుకుంటూముగ్గురు మత్యకారులు సురక్షితంగా బయటపడ్డారు.వారిలో ఒకరు సముద్ర అలలకు గల్లంతయ్యాడు. ఆ గల్లంతైన మత్యకారుడు బంగారమ్మపాలెం ఏటి మొగ వద్ద లభ్యమైంది.మృతుడు చోడిపల్లి సింహాద్రి గా గుర్తించారు.దీంతో స్థానిక మత్యకారులు సంఘటనా స్థలానికి చేరుకుని సింహాద్రి మృతదేహం వద్ద కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రేవుపోలవరం గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లభ్యమైన సింహాద్రి మృతదేవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్.రాయవరం పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




