పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు….

పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు….

నేర నియంత్రణ శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడవద్దు….
మహిళల హక్కులు, చట్టపరమైన రక్షణ, సాధికారిత కొరకు ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి….
జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్

నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని నందికొట్కూరు టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అర్బన్ రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో గౌరవంగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలి అని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

పిజిఆర్ఎస్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. అనంతరం సిసిటిఎన్ఎస్ గురించి, పనితీరు, కేసుల దర్యాప్తు,పరిష్కారంలో వాటి పాత్ర పై మొదలగు వాటిపై సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. అనంతరం నందికొట్కూరు టౌన్, రూరల్ సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో గల పెండింగ్ కేసులపై క్షుణ్ణంగా రివ్యూ నిర్వహించడం జరిగింది అని అన్నారు. అర్బన్ పరిధిలో ఎన్ని కేసుల పెండింగ్ గల కారణాలపై ఆరా తీశారు. ప్రస్తుతం ఉన్న పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు అనగా దర్యాప్తు, ముద్దాయిల అరెస్టు నాన్ బెయిలబుల్ వారెంట్) లను ఎగ్జిక్యూట్ చేయడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలన్నారు.

నేరం చేసిన వారికి శిక్ష పడేలా దర్యాప్తు నిర్వహించి పోలీస్ శాఖపై ప్రజల నమ్మకాన్ని పెంపొందించాలి అని సూచించారు. సైబర్ క్రైమ్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలి తెలిపారు. మహిళల హక్కులు, చట్టపరమైన రక్షణ, మహిళా సాధికారిత మొదలగు అంశాలపై భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ప్రభుత్వం తీసుకునే చర్యలను ప్రజలకు వివరించాలి. మీ పోలీస్ స్టేషన్ ల పరిధిలోని గ్రామాలలో ప్రజల ఐక్యత కొరకు గ్రామసభలు నిర్వహించి ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ నందికొట్కూరు రూరల్ సర్కిల్, టౌన్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply