ఆలయ కమిటీ అధ్యక్షుడుగా గోవింద్ ఏకగ్రీవంగా ఎన్నిక …

ఆలయ కమిటీ అధ్యక్షుడుగా గోవింద్ ఏకగ్రీవంగా ఎన్నిక …

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలం కారేపల్లి గ్రామంలో శనివారం నూతన గా గ్రామ, ఆలయ కమిటీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని గ్రామ పెద్దలు అన్నారు. కమిటీ అధ్యక్షుడిగా బాదావత్ గోవింద నాయక్ పాధ్యక్షుడిగా బాణావత్ ప్రేమ్ కుమార్, కార్యదర్శిగా మూడవత్ ప్రకాష్, స్వయక్త కార్యదర్శి భూక్య వెంకట్ రామ్, సభ్యులుగా ధరావత్, దేవిచంద్, రామవత్ మల్లేష్, ధారావత్ రాములు, మూడవత్ రమేష్, మూడవత్ వెంకట్రాం లను గ్రామ పెద్దల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షుడు మాట్లాడుతూ, గ్రామస్తులు నాపై నమ్మకంతో గ్రామ కమిటీ ఆలయ కమిటీ అధ్యక్షుడుగా ఎన్నుకున్నందుకు గ్రామస్తులకు నమ్మకంతో ఆలయ కమిటీకి గ్రామస్తులకు సేవకుడుగా పనిచేసి చూపిస్తానని నూతనంగా ఎన్నుకోబడ్డ ఆలయ కమిటీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గోవింద్ అన్నారు. అలాగే ఈనెల 26వ తారీకు ఆదివారం రోజున సేవాలాల్ ఆలయ వార్షికోత్సవం ఉత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జాతర ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కావున గ్రామం నుండి చుట్టుపక్కల ఉన్న తాండ వాసులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని సేవాలాల్ మహారాజ్ కృప అభిషేకంతో పాటు జత్ర ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్నసత్రం ఏర్పాటు చేయడం జరిగింది.

భక్తులు ఈ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు పాల్గొని విజయవంతం చేయాలని గ్రామ ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాదావత్ మోతిలాల్,మాజీ సర్పంచ్ చంద్రకళ (వాసు నాయక్,) ఎంపీటీసీ గోవింద్ నాయక్, మాజీ గ్రామ ఆలయ కమిటీ అధ్యక్షుడు బాదావత్ గంగాధర్, నాయకులు అంబోజి నాయక్ నరేష్ మోహన్ ఆలయ పూజారి తౌరియా నాయక్ కారోబారీలు, పెద్ద మనుషులు వివిధ పార్టీల నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply