Pedapalli  కాలేశ్వరం జోన్‌లో ఎస్సైల స్థానచలనం

Pedapalli  జోన్‌లో ఎస్సైల స్థానచలనం

  • నలుగురు సబ్‌ఇన్‌స్పెక్టర్లకు కొత్త పోస్టింగ్‌లు

పెద్దపల్లి (Pedapalli), ఆంధ్రప్రభ: కాలేశ్వరం జోన్ పరిధిలో పనిచేస్తున్న నలుగురు సబ్‌ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ జోన్ డీఐజీ, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

ఉత్తర్వుల ప్రకారం, మంచిర్యాల సీసీఎస్‌లో పనిచేస్తున్న కే. నరేష్‌ను పెద్దపల్లి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. కెరీమెరి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మధుకర్‌ను రామగుండం వీఆర్‌కు పంపించారు.

ములుగు డీఎస్‌బీలో పనిచేస్తున్న ఉపేందర్‌రావును రామగుండం సీసీఎస్‌కు బదిలీ చేశారు. అలాగే ఇటీవల పెద్దపల్లికి బదిలీ అయిన జీవన్‌కు సంబంధించిన గత ఉత్తర్వులను రద్దు చేసి, ఆయనను సీసీఎస్ పెద్దపల్లికి బదిలీ చేస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మేరకు సంబంధిత అధికారులు తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Leave a Reply