స్వచ్ఛంద సేవలు సద్వినియోగం చేసుకోవాలి

స్వచ్ఛంద సేవలు సద్వినియోగం చేసుకోవాలి
- సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా
పాయకాపురం, ఆంధ్రప్రభ:
స్వచ్ఛంద సంస్థలు అందించే సేవలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. గొట్టుముక్కల ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమం బుధవారం సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని రామకృష్ణ పురంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని గతంలో గొట్టుముక్కల ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో బాధితులకు కళ్ళ జోళ్ళు ఉచితంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్,ఏపీ బొక్వా చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు,దాసరి కనకారవు,బుదాల సురేష్,గౌస్ బాషా,కంచేటి నాగరాజు, డిడి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
