payal radhakrishna| పాపం ప్రతాప్ మూవీ బ్యూటీ సోయ‌గం..

payal radhakrishna| పాపం ప్రతాప్ మూవీ బ్యూటీ సోయ‌గం..

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలుగు తెరపైకి మరో కన్నడ అందం దూసుకొచ్చింది. పాయల్ రాధాకృష్ణ ఇటీవల రిలీజైన పాపం ప్రతాప్ మూవీలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో తిరువీర్ హీరోగా నటించారు. ఏప్రిల్ 17న విడుద‌లైన పాపం ప్రతాప్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వ‌చ్చింది. దీంతో పాయల్ రాధాకృష్ణకు తెలుగులో మరిన్ని అవకాశాలు క‌నిపిస్తున్నాయి. అందంతో పాటు డ్యాన్స్‌లోనూ ఎక్స్‌పర్ట్ కావడంతో రానున్న రోజుల్లో టాలీవుడ్‌లో ఈ కన్నడ కస్తూరి గట్టిగానే జెండా పాతే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 2017లో బెంగళూరు అండర్‌ వరల్డ్ మూవీ ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ తర్వాత డిఫరెంట్ అనే మరో కన్నడ మూవీలో నటించారు. ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేశారు. తరగతి గది దాటి, అలా నిన్ను చేరి, ప్రసన్న వదనం, సత్యభామ, నీలి మేఘ శ్యామ, కుమార సంభవం, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ తదితర సినిమాలలో నటించారు.

Leave a Reply