Eluru-Trupti-Canteen : తృప్తిలో.. సంతృప్తి Andhra Prabha Spl News

Eluru-Trupti-Canteen : తృప్తిలో.. సంతృప్తి Andhra Prabha Spl New

  • టిఫిన్​ సూపర్​
  • మెప్మా క్యాంటీన్​ పై మంత్రి కితాబు
  • ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామిక వేత్త సర్కారు లక్ష్యం
  • రాష్ట్ర మంత్రి నారాయణ వెల్లడి

ఆంధ్ర ప్రభ, ఏలూరు బ్యూరో.

ఏలూరు జ్యూట్ మిల్లు సెంటరులో స్వయం సహాయక సభ్యులు ఆధకవర్యంలో నడుస్తున్న ‘తృప్తి క్యాంటిన్’ను శనివారం రాష్ట్ర పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సందర్శించారు.

క్యాంటీన్లో అందిస్తున్న ఆహార పదార్థాలు నాణ్యత, పరిశుభ్రత, నిర్వహణ విధానాలను పరిశీలించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులతో ముఖాముఖిలో మాట్లాడి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకున్నారు. తృప్తి క్యాంటీన్లో మంత్రి, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, జిల్లా జాయింట్ కలెక్టర్ అల్పాహారాన్ని స్వీకరించి, సంతృప్తిని వ్యక్తం చేశారు.

Eluru-Trupti-Canteen : ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామిక వేత్త రావాలి

మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ, ప్రతి ఇంటినుండి ఒక్కరిని పారిశ్రామిక, వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని, ముఖ్యముగా మహిళలు మొదటి ప్రాధాన్యత ఇస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ రోజు తృప్తి క్యాంటీన్లో అందరం కలిసి అల్పాహారం తీసుకున్నామని, చాలా చాలా రుచిగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో తొలి తృప్తి క్యాంటీన్ నెల్లూరు జిల్లాలో శ్రీకారం చుట్టామని, విజయవాడ, విశాఖపట్నం ఇప్పటికి 8ప్రారంభించామని, త్వరలో మరో 8 ప్రారంభిస్తామని, దశలువారీగా రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

మహిళా సాధికారతకు, డ్వాక్రా సంఘాలకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం ప్రభుత్వం అని అన్నారు. మహిళా అభివృద్ధికి, ఆర్థికంగా బలపేతం కావాలని కూటమిప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టి, అందుకు అనుగుణంగా ఎన్నో కార్యక్రమాలు డిజైన్ చేసి అమలు చేస్తున్నామని అన్నారు. అనుభవం ఉన్న స్వయం సహాయక సంఘాలు (ఎస్.హెచ్.జి) మహిళలు భాగస్వామ్యంతో కంటెయినర్లలో ఈ క్యాంటీన్లు నడుస్తాయని అన్నారు. ఒక్కో క్యాంటీన్ ఏర్పాటుకు దాదాపు రూ 12.30 లక్షలు నుండి రూ 14.50 లక్షలు వరకు ఖర్చవుతుందని, మెప్మా, సారాస్, ఏజెన్సీ ద్వారా సమకూరుస్తారని అన్నారు. ఈ క్యాంటీన్ల ద్వారా మహిళలకు నెలకు రూ 2.50 లక్షలు వరకు ఆదాయం, రోజుకు రూ 10 వేలు నుండి రూ 15,000 వరకు వచ్చేలా ప్రణాళికలు రూపొందించామని, కాని రోజుకు రూ 30 వేలు నుండి రూ 35 వేలు మంచి ఆభాలు వస్తున్నాయని మహిళలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

Eluru-Trupti-Canteen : ఇది శుభ పరిణామం

ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ, తృప్తి క్యాంటీన్లు నిర్వహణ మహిళలకు అప్పగింటం శుభపరిణామం అన్నారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత, వంట విధానం, ప్రజలకు అందిస్తున్న సేవలుపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ, వ్యాపారానికి నాణ్యత, నమ్మకం పెట్టుబడి అని అన్నారు. తక్కువ ధరకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

ప్రజలకు అందిస్తున్న సేవలు నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని, క్యాంటీన్లో పరిశుభ్రత ప్రమాణాలను ఎల్లప్పుడూ పాటించాలని అన్నారు. ఏలూరు జిల్లాలో తొలి తృప్తి క్యాంటీన్ విజయవంతం అయిందని, రెండవ తృప్తి క్యాంటీన్ కు ఏర్పాటుకు స్థలసేకరణ చెయ్యాలని, సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టరు ఆదేశించారు.

Eluru-Trupti-Canteen : కూటమి సర్కారు ఔనిత్యం

ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మహిళలు సాధికారతకు, ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. జిల్లాలో తృప్తి క్యాంటీన్ విజయవంతం అయిందని, రెండవ తృప్తి క్యాంటీన్ కు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. స్వయం సహాయక సంఘాలు ప్రతినిధులు అనుభవం ఉన్న వారికి అప్పగించి క్యాంటిన్లు ఏర్పాటు శ్రీకారం చుట్టి, మరో నాలుగుమంది స్వయం సహాయక మహిళలను ఇందులో భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. తక్కువ ధరకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని ప్రజలకు అందించడం అభినందనీయమని, పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వంట పదార్థాలు రుచిగా, పరిశుభ్రత, ఆహార నాణ్యత ప్రమాణాలను పాటించాలని వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.లక్ష్మిప్రసన్న, ఏలూరు ఉడా చైర్మన్ పెద్దిబోయిన వాణి శివప్రసాదు, నగర పాలక సంస్థ కమీషనరు ఏ.భాను ప్రతాప్, మెప్మా పిడి యం.రాజ బాబు, తహశీల్దారు కె.గాయత్రీదేవి, ఏయంసి ఛైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కో-ఆప్షన్ సభ్యులు ఎస్.ఎం.ఆర్. పెదబాబు, చోడే వెంకట రత్నం, వివిధ కార్పొరేటర్లు, జీవనోపాధి జిల్లా కోఆర్డినేటరు సి.హెచ్.మహాలక్ష్మి, నాగసాయి స్వయం సహాయక సంఘం సభ్యురాలు కొనే క్రాంతి, సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.