Mumbai: ఆసుపత్రి నుంచి పవన్ కల్యాణ్ డిశ్చార్జి..

Mumbai: ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముంబయిలోని ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్చార్జి అయ్యారు. నాలుగు రోజుల క్రితం ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆయన భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.

శస్త్రచికిత్స అనంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న పవన్ కల్యాణ్.. వారి సూచన మేరకు ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకున్నారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో బుధవారం ఆయనను వైద్యులు డిశ్చార్జి చేశారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పవన్ కల్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. డిశ్చార్జి అనంతరం పవన్ కల్యాణ్ వైద్యుల సూచనల మేరకు మరికొంతకాలం విశ్రాంతి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.