మహిళలకు చీరలు పంపిణీ..
పాయకాపురం, (ఆంధ్ర ప్రభ): మల్లాది విష్ణు జన్మదినం సందర్భంగా రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు పేరం త్రివేణి రెడ్డి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు తోపుల లక్ష్మి ఆధ్వర్యంలో సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీ నందు మల్లాది విష్ణు కార్యాలయంలో పేదలకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా త్రివేణి రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ఉంచడానికి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఒక దార్శనికుడిగా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దిన నేత మల్లాది విష్ణు అని కొనియాడారు.నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు తోపుల వరలక్ష్మి మాట్లాడుతూ మల్లాది విష్ణు జన్మదినాన్ని నియోజకవర్గంలో ప్రజలు ఒక పండగ జరుపుకుంటున్నారని, వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులే కాకుండా ఇతర పార్టీ నాయకులు కూడా ఆయనను అభిమాణిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మారుతి, ఫాతిమా, హైమావతి, బాలనాగమ్మ, శ్రీలత, పూర్ణిమ, రాజ్యేశ్వరి ,చంటి , సుభాని , శిరీషా, అషా, బేబీ, నాయకులు పాల్గొన్నారు.
