కొత్తూరులో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన గోదాం

కొత్తూరు (ఆంధ్రప్రభ): కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రంలో బుధవారం ఓ గోదాంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. మున్సిపాలిటీ పరిధిలోని బాబూలాల్‌కు చెందిన వ్యవసాయ పొలంలో నిర్మించిన గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో గోదాం పూర్తిగా కాలిబూడిదైంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.