Tangirala sowmya | లోకేష్‌కి జన్మదిన శుభాకాంక్షలు..

Tangirala sowmya | లోకేష్‌కి జన్మదిన శుభాకాంక్షలు..
- ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య
Tangirala sowmya | నందిగామ, ఆంధ్రప్రభ : పట్టణం కాకాని నగర్‌లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో ఈ రోజు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నేతలతో కలిసి కేక్‌ను కట్ చేసిన తంగిరాల సౌమ్య నారా లోకేష్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రజలకు ఉపయోగపడే విధంగా ఐటీ, విద్యాశాఖల్లో సంస్కరణలు చేపడుతూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న నారా లోకేష్ సేవలు మరింత విస్తృతం కావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని నారా లోకేష్ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.

