8వ వార్డులో పాశికంటి శ్రీనివాస్ ప్రచారం..

8వ వార్డులో పాశికంటి శ్రీనివాస్ ప్రచారం..
ఆలేరు, ఆంధ్రప్రభ : ఆలేరు మున్సిపల్ పరిధిలోని 8 వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి పాశికంటి శ్రీనివాస్ శనివారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఓటర్లను కలుసుకొని తాను వార్డు అభివృద్ధికి చేపట్టాలనుకుంటున్న పలు కార్యక్రమాలను వివరిస్తూ ఆయన ప్రచారం జరిపారు. ఒక్క అవకాశం ఇచ్చి తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ప్రచారంలో కాలనీకి చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
