గ్రామాలను చెత్త రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

గ్రామాలను చెత్త రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

  • ఎంపీడీవో సీతారామయ్య

శావల్యాపురం, ఆంధ్రప్రభ : పారిశుధ్యాన్ని మెరుగుపరిచి గ్రామాలను చెత్త రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీడీవో సీతారామయ్య అన్నారు. పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూపొందించిన స్వచ్ఛపధం కార్యక్రమాన్ని మండలంలోని కారుమంచిలో బుధవారం ప్రారంభించారు. ఎంపీడీవో పేరుమీన సీతారామయ్య, డిప్యూటీ ఎంపీడీవో వివేకానంద పాల్గొని క్లాప్మిత్రలతో కలసి గ్రామంలోని ప్రధాన వీధుల్లో రోడ్లుపై చెత్తచెదారాన్ని ఊడ్చి శుభ్రం చేశారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ స్వర్ణాంద్ర-స్వచ్చాంద్ర, స్వచ్చపధం వంటి కార్యక్రమాలను రూపొందించి గ్రామాలలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, ప్రజలు తమవంతు సహకారం అందించి బాగస్వాములు కావాలని కోరారు. పంచాయతీ కార్యదర్శి జ్యోత్స్న, స్వచ్చభారత్ కోఆర్డినేటర్ కోటేశ్వరరావు ఉన్నారు.

Leave a Reply