దుర్గమ్మ భక్తులకు పార్కింగ్ టోల్ తాత్కాలిక మినహాయింపు
దుర్గమ్మ భక్తులకు పార్కింగ్ టోల్ తాత్కాలిక మినహాయింపు
కొత్త టెండర్ దారుడు బాధ్యతలు స్వీకరించే వరకు ఉచిత పార్కింగ్
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : ఇంద్రకీలాద్రి లోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో భక్తులకు పార్కింగ్ టోల్ రుసుమును తాత్కాలికంగా మినహాయిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి పార్కింగ్ టోల్ వసూళ్ల హక్కులు బహిరంగ వేలంలో రూ.2,46,00,000/-కు ఖరారైనప్పటికీ, కొత్త టెండర్ దారుడు నిబంధనల ప్రకారం దేవస్థానానికి చెల్లింపులు పూర్తి చేసి అధికారిక ఉత్తర్వులు పొందే వరకు ఈ మినహాయింపు అమల్లో ఉంటుందని తెలిపారు.
దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికె శీనా నాయక్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం కార్లు, బైక్‌లు కొండపైకి రావడానికి, అలాగే మినీ బస్సులు, వ్యాన్లు కొండ దిగువన ఉన్న దేవస్థానం పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపేందుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఈవో వికె శీనా నాయక్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, పాత పార్కింగ్ టెండర్ దారుని గడువు మార్చి 31, 2026తో ముగిసినట్లు అధికారులు తెలిపారు.

