Parakala | మిషన్ భగీరథ నల్లాకు అక్రమంగా మోటార్..

Parakala | మిషన్ భగీరథ నల్లాకు అక్రమంగా మోటార్..

  • అక్రమంగా అదనపు నీటి కోసం
  • మోటార్లతో గృహవాసులకు ఇబ్బందులు

Parakala | పరకాల, ఆంధ్రప్రభ : మిషన్ భగీరథ మంచినీటి నల్లాకు అక్రమంగా మోటర్లు బిగించడంతో గృహవాసులు ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని భూపాలపల్లి రోడ్డు పద్మశాలి వీధిలో గల వినాయక వైన్స్ బిల్లింగ్ కు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఉండగా అక్రమంగా అదనపు నీటి కోసం మోటార్ బిగించడం వల్ల సమీప గృహవాసులకు మిషన్ భగీరథ నీరు సరిపడ రావడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా మోటర్లు బిగించడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని, మిషన్ భగీరథ నల్లా కు అక్రమంగా మోటర్లు బిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటికి మంచినీరు సరిపడా వచ్చే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని గృహవాసులు కోరుతున్నారు.

Leave a Reply