రజక రిజర్వేషన్ సమితిలో కొత్త నియామకాలు..
సూర్యాపేట జిల్లా ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడిగా పాలెల్లి అంజయ్య..
గరిడేపల్లి, ఆంధ్రప్రభ: తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి సూర్యాపేట జిల్లా కమిటీ విస్తరణలో భాగంగా పలు నూతన నియామకాలు చేపట్టింది. జిల్లా అధ్యక్షుడు గూడెపు నాగలింగం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో ఈ ఎంపికలు జరిగాయి.
నూతన నియామకాల ప్రకారం సూర్యాపేట జిల్లా ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడిగా పాలెల్లి అంజయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శిగా గూడెపు వెంకటేశ్వర్లు, గరిడేపల్లి మండల యూత్ ఉపాధ్యక్షుడిగా గూడెపు నాగరాజును నియమించారు.
నూతనంగా ఎన్నికైన సభ్యులకు రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక, జిల్లా అధ్యక్షుడు గూడెపు నాగలింగం శనివారం నియామక పత్రాలను అందజేశారు. రాష్ట్ర, జిల్లా కమిటీల తరఫున వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నూతన సభ్యులు మాట్లాడుతూ తమపై ఉంచిన నమ్మకానికి తగిన విధంగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తామని తెలిపారు. రాష్ట్ర, జిల్లా కమిటీల ఆదేశాలకు అనుగుణంగా సంఘ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మట్టపల్లి రజక సత్రం చైర్మన్ పిల్లుట్ల కృష్ణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్లానపు సత్యనారాయణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొమర్రాజు ఆంజనేయులు, జిల్లా నాయకులు దుగ్గి వర్మ, హుజూర్‌నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు తాతరాజు రామలింగం, చింతలపాలెం మండల ఉపాధ్యక్షుడు పరిమ వీరయ్య, హుజూర్‌నగర్ ఇస్త్రీ షాపుల అధ్యక్షుడు ఇందిరాల నర్సయ్య, నాయకులు యలమంద సుందరం, వడ్లానపు శ్రీను, కొమర్రాజు నాగయ్య, పాలెల్లి వెంకటేష్, అలవాల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
