ప్రకటన ఒకటి.. అమలు మరొకటి..!
- 9 గంటలకు విద్యుత్ బంద్ అంటూ.. 9:50కి నిలిపివేత
- అధికారుల తీరుపై విమర్శలు
కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ: విద్యుత్ నిర్వహణ పనుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని విద్యుత్ శాఖ శుక్రవారం వాట్సాప్ గ్రూపు ద్వారా ముందస్తుగా ప్రకటించింది. అయితే ప్రకటించిన సమయానికి కాకుండా ఉదయం 9:50 గంటలకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
అధికారులు ప్రకటించిన సమయాలను పాటించకపోవడంతో తమ రోజువారీ పనుల్లో అంతరాయం ఏర్పడిందని స్థానికులు తెలిపారు. ముందస్తు ప్రకటనలు చేసి వాటిని అమలు చేయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఇకపై విద్యుత్ సరఫరా నిలిపివేతకు సంబంధించిన సమయాలను ముందుగానే ప్రకటించి, వాటిని కచ్చితంగా అమలు చేయాలని స్థానికులు విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు.
