మంత్రి బండి సంజయ్ ని అభినందించిన మాధవరెడ్డి..

వికారాబాద్, ఆంధ్రప్రభ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను వికారాబాద్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు కూకట్ మాధవరెడ్డి శనివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సుప్రసిద్ధ అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామి చిత్రపటాన్ని బండి సంజయ్‌కు అందజేసి, ఆయురారోగ్యాలతో పాటు ప్రజాసేవలో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అనిల్ యాదవ్, నాయకులు పోకల సతీష్ తదితరులు పాల్గొన్నారు.